RR: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ అదృశ్యమైన ఘటన కేశంపేట PS పరిధిలో చోటుచేసుకుంది. కేతావత్ లలిత భర్త అశోక్ పటేల్ అనారోగ్యంతో మృతిచెందిన కారణంగా తన సోదరుడైన కేశంపేట మండలం పొడగుట్ట తండాకు చెందిన కేతవత్ ప్రకాశ్ వద్ద తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఆమె కనిపించడం లేదు. ఆచూకీ తెలియకపోవడంతో ఆమె సోదరుడు PSలో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేశారు.