NLG: మర్రిగూడ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ఇంటి ఆవరణంలో, అదే గ్రామానికి చెందిన పలువురు జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. 8 మందితో పాటు ఏడు మొబైల్ ఫోన్లు, రూ.44,260 నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.