KRNL: జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి. శాంతికళను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ CMOHOకు మంగళవారం బదిలీ చేశారు. ఆమె స్థానంలో కొత్త అధికారి బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడాది డిసెంబర్లో కర్నూలులో బాధ్యతలు స్వీకరించిన శాంతికళ, వ్యక్తిగత కారణాలతో తరచూ సెలవులు తీసుకోవడం, అధికారులతో సమన్వయం లోపించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ బదిలీ జరిగినట్లు సమాచారం.