కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆర్టిస్టులకు పారితోషికంతో పాటు ప్రేమ, గౌరవం కూడా కావాలి. వారంతా మనసుతో పని చేస్తుంటారు. గౌరవం లేనప్పుడు పనిచేయాలని అనిపించదు. ఈ మూవీ నిర్మాత ఆరిస్టులను ఎంతో ప్రేమగా చూశారు’ అని పేర్కొన్నాడు.