VZM: విజయనగరం బుక్కా వీధి ఆర్య సోమయాజుల భవనంలో ఈరోజు జై భీమ్ రావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేదో మథన సదస్సు నిర్వహించారు. PPP విధానం వల్ల ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ చేయబడతాయని ఆరోపించారు. ఇందులో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి పి.సురేష్, ఈశ్వర్ కౌశిక్ పాల్గొన్నారు.