పంజాబ్లో మాజీ డీజీపీ ముస్తాఫా కుమారుడు అఖీల్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. తొలుత ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా భావించినా.. తాజాగా హత్య కేసుగా మారింది. తన భార్యతో తన తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖీల్ రికార్డు చేసిన ఓ వీడియోను అతని స్నేహితుడు బయటపెట్టాడు. దీంతో ఈ ఘటనను హత్య కేసుగా నమోదు చేసి ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.