NLG: జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా, ఎలాంటి సెలవులు లేకుండా ప్రజల రక్షణ కోసం పనిచేస్తారన్నారు. వారి త్యాగాలతోనే నేడు శాంతియుత వాతావరణం నెలకొందని, శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసు అమరవీరుల త్యాగాలు ఎంతో విలువైవని కొనియాడారు.