BHNG: BRS అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. ఏఐసీసీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కి లేదని ఘాటుగా విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కమిటీలో దానం నాగేందర్ పేరు చూసి నీతి గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ తలసాని, సబితా ఇంద్రారెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏమైంది నీ రాజనీతి అని ప్రశ్నించారు.