NTR: తిరువూరు మండలం ఆంజనేయపురంలో జర్నలిస్ట్ మల్లాది ప్రకాష్ గుండెపోటుతో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన పార్థివ దేహాన్ని కౌన్సిలర్ ప్రసాద్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాష్ కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదని, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని, మరణం విలేకరుల వర్గానికి తీరని లోటని ప్రసాద్ పేర్కొన్నారు.