ATP: గుత్తి పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో కల్తీ పెట్రోల్ సరఫరా చేశారని చంద్రశేఖర్ అనే వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పెట్రోల్ వేయించుకోగా పెట్రోల్ తెల్లగా ఉండడంతో కల్తీ చేశారంటూ పెట్రోల్ బంక్ నిర్వాహకులపై మండిపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు.