పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్‌లో నిలవాలంటే గురువారం అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డేలో భారత్ తప్పక గెలవాల్సి ఉంది. దీంతో తుది జట్టులో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. కుల్దీప్ యాదవ్‌ను రెండో వన్డేలో ఆడించే అవకాశముంది. సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణాపై వేటు వేసే అవకాశముంది.