వరంగల్ పట్టణ పరిధిలో నిన్న రాత్రి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రాహుల్ గంజాయి మత్తులో ఉన్న పరిస్థితిలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.