కృష్ణా: నిబంధనలకు విరుద్ధంగా జంతు వ్యర్థాలను చేపలకు ఆహారంగా మార్చేందుకు తరలిస్తున్న ఘటనను నందివాడ పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఏలూరు జిల్లా గుడిపాడు ప్రాంతానికి బొలెరో వాహనంలో కోడి వ్యర్థాలను తరలిస్తుండగా పోలీసులు ఆ వాహనాన్ని నందివాడ గ్రామ పరిధిలో గుర్తించి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు.