సత్యసాయి: పెనుకొండ మండలం కోనాపురం ఎస్సీ కాలనీ వాసులు హిందూపురం ఎంపీ. బీకే పార్థసారథిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో సప్పలమ్మ దేవస్థానం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎంపీను కోరారు. ఎంపీ స్పందిస్తూ తప్పకుండా దేవస్థానం నిర్మాణానికి నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.