BPT: బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం కలెక్టరేట్లో జిల్లా మండల స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.