AP: ప.గో. జిల్లా ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. సివిల్ వివాదాల్లో DSP జోక్యం చేసుకుంటున్నారని.. ఎస్పీకి తెలిపారు. డీఎస్పీ వ్యవహారశైలిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని ఆదేశించారు. శాంతిభద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు.