KMM: ఏన్కూర్ మండలం శ్రీ రాంపురం గ్రామానికి చెందిన మండలి లింగయ్య TSTTF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య బాబులాల్ మాతృమూర్తి భూక్యా ద్వాలి అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మృతురాలు ద్వాలి పార్దివ దేహానికి నివాళి అర్పించారు. ద్వాలి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.