BDK: చర్ల మండలం కుదునూరు గ్రామపంచాయతీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కుంచా నాగేశ్వరరావు మంగళవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, నాగేశ్వకరరావుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు తెలిపారు.