AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన 6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో పోలీసు శాఖలో నియామకాలు చేపట్టలేదని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.