TG: HMDA అనూహ్యమైన ప్రగతి సాధిస్తూ.. వేగవంతమైన పనితీరుతో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది భవన అనుమతుల కోసం మొత్తం 2,961 దరఖాస్తులు రాగా.. అందులో 2,904 దరఖాస్తులను పరిష్కరించింది. వీటి సంఖ్య 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం ఎక్కువ. దీని ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ. 1,225 కోట్ల ఆదాయం వచ్చింది.