SKLM: రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి భూములు కోల్పోయిన 16 మంది నిర్వాసితులకు పరిహారం అందలేదు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా, ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం జమ చేయించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యేను నిర్వాసితులు కలిసి శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.