W.G: నిర్మాత దగ్గుపాటి సురేష్‌ను అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి సభ్యులు మంగళవారం కలుసుకున్నారు. డిసెంబర్ 19 నాటికి శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ చిత్రం 50 వసంతాలు పూర్తి చేసుకుంటుందని, ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. సురేష్ ప్రొడక్షన్స్ లో శోభన్ బాబు 11 చిత్రాల్లో నటించారని కన్వీనర్ భట్టిప్రోలు శ్రీనివాసరావు (భీమవరం) తెలిపారు.