ELR: పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బొర్రా పద్మకి రూ.55,450 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.