WGL: జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి సోమవారం కొండ దంపతులు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరంగల్ అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయించే విధంగా చొరవ చూపాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.