JGL: యువజన గౌడ సంఘం కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా బాలసాని ప్రణయ్ గౌడ్‌ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు బొంగోని పవన్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్, జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్ ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రణయ్ గౌడ్‌ను పలువురు అభినందించారు.