ADB: పోలీస్ అమరవీరుల త్యాగం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పేరేడ్ గ్రామంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర మరువలేనిదని అన్నారు.