SKLM: కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను గడిచిన నెల రోజులుగా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పి.తేజేశ్వరరావులు దుయ్యబట్టారు. బుధవారం శ్రీకాకుళంలో వారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం వైద్య సేవలు ఎందుకు నిలిపి వేస్తున్నారని మండిపడ్డారు.