HYD: కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ అధికారులు, అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మవారికి వివిధ ప్రాంతాల పుష్పాలతో అలంకరించి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి పంచ హారతులు ఇచ్చారు. భక్తులు బారులు తీరి అమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.