ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నవీకరణ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత ప్రొఫార్మాలో ఇరవై రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌తో పాటు జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లకు పంపించాల్సి ఉంటుందని దేవస్థానం ఈఓ తెలిపారు.