CTR: సోమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్ పోస్ట్ భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ అమరేంద్ర కుమార్ తెలిపారు. ఎంఎస్సీ జువాలజీలో 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలని సూచించారు.