BDK: లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీలో దుద్దుకురి నాగేశ్వరరావు బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నాగేశ్వరరావు భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పాల్గొన్నారు.