CTR: పుత్తూరు పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం పడుతుంది. మూలకోన (పెద్దతీర్థ కోన) వాటర్ ఫాల్స్ ప్రవాహం ఎక్కువగా ఉంది. పర్యాటకులు, చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజలు ఎవరై కోనకు రావద్దని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ కోనకు వెళ్లే రోడ్డును తాత్కాలికంగా మూసివేశామని.. వర్షం కొనసాగితే గురువారం కూడా మూసివేస్తామని స్పష్టం చేశారు.