కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధార్ వివరాల్లో మార్పు, సమీకరణ కోసం ఈరోజు నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,55,780 మంది విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార అప్డేట్ చేయాలని అధికారులు కోరుతున్నారు.