SKLM: విశాఖపట్నం ఆర్టీవోగా సనపల సుధా సాగర్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీవో శ్రీలేఖ ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆమె స్థానంలో సుధా సాగర్ను నియమించారు. మంగళవారం విధులలో చేరనున్నారు. ఈయన కోటబొమ్మాలి మండలం కస్తూరి పాడు గ్రామానికి చెందిన వారు గతంలో శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు.