అన్నమయ్య: పీలేరు విశ్రాంత MEO రెడ్డి సుబ్రహ్మణ్యం (82) సోమవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉపాధ్యాయ వృత్తిలో, విద్యారంగ అభివృద్ధికి విశేష సేవలు అందించిన విశిష్ఠ విద్యావేత్తగా ఆయన పేరుపొందారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ సిబ్బంది, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, శిష్యులు నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. అంత్యక్రియలు ఈరోజు ఉదయం జరగనున్నాయి.