WGL: జిల్లా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లోని అమరవీరుల స్థూపం వద్ద CP సన్ ప్రీత్ సింగ్, జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరై నివాళులర్పించనున్నారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు.