BHPL: గ్రామీణ స్థాయిలో నిర్వహించే టోర్నమెంట్లు క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు తెస్తాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంగళవారం ఉదయం కాటారం మండలం శంకరంపల్లిలో జరిగిన ఛాంపియన్ ట్రోపీ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాస్ఫూర్తితో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.