AP: పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసులది కీలకపాత్ర అని కొనియాడారు. వారి త్యాగాలు మార్గదర్శక కాంతిగా ప్రకాశిస్తాయన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోలీసు సోదరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను అని ‘X’లో తెలిపారు.