టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ సెలెక్టర్ కష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో స్టార్ బౌలర్ కుల్దీప్ను ఆడించకుండా టీమిండియా తప్పు చేసిందని మండిపడ్డాడు. భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కీలక వికెట్లు తీసాడని గుర్తు చేశాడు.