TG: బస్తీ దవాఖానాల్లో సాధారణ మందులు కూడా లేవని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌కు మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదంటూ విమర్శించారు. సీఎం ఒక్కసారైనా రివ్యూ చేశారా అంటూ ప్రశ్నించారు.