NGKL: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఆయన కొనియాడారు.