GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (APSPF) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో SPF కమాండెంట్ D.N.A. భాషా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.