SKLM: పోలీస్ అమరవీరుల సేవలు మరిచిపోలేనివని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వారిని స్మరించుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. వారి సేవలతోనే నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని కొనియాడారు.