NZB: నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాలకు గుర్తుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, సీపీ సాయి చైతన్య పాల్గొన్నారు.