SKLM: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ మంగళవారం పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.