ప్రకాశం: వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలించనున్నట్లు టంగుటూరు MRO ఆంజనేయులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో లోతట్టుగా ఉన్న 90 కుటుంబాలను గుర్తించినట్లు ఆయన చెప్పారు. వీరిని వేరే ప్రాంతానికి తరలించి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. మత్స్యకారులు, అధికారులు సూచనలు చేసేవరకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.