పరమ పవిత్రమాసం కార్తీకమాసం. ఈ మాసంలో నదీస్నానాలు, దీపతోరణాలు, దానాలు ప్రధానమైనవి. శివకేశవులను ఆరాధించాలి. ఉపవాస దీక్ష అవలంభించాలి. ఈ మాసమంతా ఆచరించని వారు కనీసం కార్తీక సోమవారం రోజు అయినా ఆచరించినట్లయితే అశ్వమేధయాగ ఫలాలు పొందగలరని పండితులు సూచిస్తున్నారు. కార్తీక స్నానం బ్రహ్మముహూర్తంలోనే చేస్తారు. ఆ సమయంలో కృత్తికా నక్షత్రకాంతి శరీరాలపై పడి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.