MNCL: ఆట పాటలతో చిన్నారులకు పాఠ్యాలు సులువుగా అర్థమవుతాయని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. గుడిరేవు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ తరగతులకు టీచర్‌గా నియమితులైన ధనలక్ష్మి, ఆయా స్వరూపలకు బుధవారం ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. చిన్నారులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఆయన సూచించారు.