TG: ప్రభుత్వ ఆస్పత్రులపై కొందరు కావాలనే బురద జల్లుతున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. బస్తీ దవాఖానాల ద్వారా రోజుకు 45 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయని.. అక్కడ అన్ని రకాల మందులు ఉంటున్నాయని, 134 రకాల ఉచిత టెస్ట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ దవాఖానాల పనితీరు వల్లే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోగుల సంఖ్య తగ్గిందని మంత్రి వివరించారు.