NZB: పోలీస్ అమరవీరుల దినోత్సవ ప్రాశస్త్యాన్ని NZB కలెక్టర్ వినియ్ కృష్ణా రెడ్డి వివరించారు. 1959 అక్టోబర్ 21న భారత్ – చైనా సరిహద్దులోని ఆక్సాయాచిన్లో 16 వేల అడుగుల ఎత్తున ఉన్న హాట్ స్ప్రింగ్స్ వద్ద డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలోని 21 మంది సీఆర్పీఎఫ్ బృందంపై చైనా దళాలు దాడి చేశారు. దీంతో 10 మంది ధైర్యవంతులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు.